దిష్టిబొమ్మ దహనం.. రూ.5 లక్షల జరిమానాతో పాటు నిషేధం

|

Jun 07, 2023 | 9:54 AM

బ్రెజిల్‌ సాకర్ స్టార్‌, రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాలర్‌ వినిషియస్‌ జూనియర్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్పానిష్‌ లీగ్‌లో భాగంగా మే21న జరిగిన మ్యాచ్‌లో వినిషియస్‌కు వ్యతిరేకంగా కొంతమంది అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతేకాదు దేశం విడిచిపోవాలంటూ నినాదించారు.

బ్రెజిల్‌ సాకర్ స్టార్‌, రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాలర్‌ వినిషియస్‌ జూనియర్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్పానిష్‌ లీగ్‌లో భాగంగా మే21న జరిగిన మ్యాచ్‌లో వినిషియస్‌కు వ్యతిరేకంగా కొంతమంది అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతేకాదు దేశం విడిచిపోవాలంటూ నినాదించారు. అయితే ఈ ఘటనపై స్పెయిన్‌ యాంటీ వయొలెన్స్‌ కమీషన్‌ సీరియస్‌ అయింది. లైవ్‌ మ్యాచ్‌ సమయంలో ఒక సాకర్‌ ప్లేయర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. కళ్ల ముందే దిష్టిబొమ్మ దహనం చేసినందుకు 60,001 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు సాకర్ గ్రౌండ్‌లో అడుగుపెట్టుకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించారు. నల్లజాతీయుడైన వినిషియస్‌ జూనియర్‌ కు ఈ వివక్ష కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం బ్రెజిల్‌ నుంచి స్పెయిన్‌కు వచ్చినప్పటి నుంచి అతను జాతి వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో రియల్‌ మాడ్రిడ్‌, అట్లెటికో మాడ్రిడ్‌ మధ్య మ్యాచ్‌లోనూ జూనియర్‌ వినిషియస్‌ వివక్షకు గురయ్యాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్వరలో ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ కంపెనీ ?? కొత్త ట్యాలెంట్ కు ప్రోత్సాహం

కలెక్షన్స్‌లలో మెగా రికార్డ్‌ ఇండియాలోనే టాప్‌ 5

RRR మరో ఘనత రీ-రిలీజ్‌ ట్రైలర్‌కూ.. గోల్డెన్ అవార్డ్‌

మీరు తప్పక చూడాల్సిన టాప్‌ వెబ్ సిరీస్‌ ఇవే..