Watch Video: ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదిన చెన్నై సారథి ధోని.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తన సన్నాహాలను ప్రారంభించింది. మహేంద్ర సింగ్ ధోనీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ధోని ఒంటి చేత్తో భారీ షాట్ కొట్టాడు.

Watch Video: ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదిన చెన్నై సారథి ధోని.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Ipl 2022 Chennai Super Kings Ms Dhoni

Updated on: Mar 09, 2022 | 7:25 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ గతేడాది ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. టోర్నీ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) నెట్స్‌లో భారీ షాట్లు కొట్టేందుకు సాధన చేస్తున్నాడు. చెన్నై కెప్టెన్ మూడు బిగ్ షాట్‌లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చివర కొట్టిన సిక్స్ ఒంటి చేత్తో కొట్టడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి దాదాపు రెండు వారాలు మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. టీమ్‌లోని ఆటగాళ్లు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. నెట్స్‌లో విపరీతంగా చెమటలు పట్టిస్తున్నారు.

2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే గట్టిపోటీని ప్రదర్శించి, ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించింది.

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ధోనీ సారథ్యంలో ఈ జట్టు నాలుగు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కాగా, రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 5 ట్రోఫీలతో అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: India vs New Zealand: న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా.. ఆ చెత్త రికార్డులకు శుభం కార్డు పడేనా?

Watch Video: వావ్.. సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్.. సలాం కొడుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో