IPL 2024: ‘ఐపీఎల్ సక్సెస్‌లో నిజమైన హీరోలు వారే’..ఒక్కొక్కరికీ 25 లక్షల నజరానా..

ఐపీఎల్ 2024కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేట‌ర్లకు బీసీసీఐ త‌లో రూ. 25 ల‌క్షల‌ న‌జ‌రానా ప్రక‌టించింది. అలాగే అద‌న‌పు వేదిక‌ల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేట‌ర్లకు త‌లో రూ. 10 ల‌క్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌ విజ‌య‌వంతంగా ముగియ‌డంలో వీరు కీల‌క‌పాత్ర పోషించిన నేప‌థ్యంలో ఇలా న‌గ‌దు న‌జరానా ప్రక‌టించిన‌ట్లు బీసీసీఐ సెక్రట‌రీ జైషా పేర్కొన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఒక‌ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు.

IPL 2024: ‘ఐపీఎల్ సక్సెస్‌లో నిజమైన హీరోలు వారే’..ఒక్కొక్కరికీ 25 లక్షల నజరానా..

|

Updated on: May 29, 2024 | 9:00 PM

ఐపీఎల్ 2024కు ఆతిథ్యమిచ్చిన 10 మైదానాల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేట‌ర్లకు బీసీసీఐ త‌లో రూ. 25 ల‌క్షల‌ న‌జ‌రానా ప్రక‌టించింది. అలాగే అద‌న‌పు వేదిక‌ల్లోని గ్రౌండ్‌మెన్లు, క్యూరేట‌ర్లకు త‌లో రూ. 10 ల‌క్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌ విజ‌య‌వంతంగా ముగియ‌డంలో వీరు కీల‌క‌పాత్ర పోషించిన నేప‌థ్యంలో ఇలా న‌గ‌దు న‌జరానా ప్రక‌టించిన‌ట్లు బీసీసీఐ సెక్రట‌రీ జైషా పేర్కొన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఒక‌ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మొత్తం 13 వేదిక‌ల్లో నిర్వహించ‌డం జ‌రిగింది. IPLలోని చాలా మ్యాచ్‌ లకు వర్షం ఆటంకం కలిగించింది. ఈ కారణంగానే కొన్ని మ్యాచ్‌లను రద్దు కూడా చేయాల్సి వచ్చింది. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను ప్రారంభించేందుకు గ్రౌండ్స్ మెన్ ఇతర సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు వీరి శ్రమను బీసీసీఐ గుర్తించింది. భారీ ప్రైజ్ మనీ ప్రకటించి వారిని గౌరవించింది.

నిజం చెప్పాలంటే ఏదైనా క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందంటే గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్లది ప్రధాన పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారు వేడి, వర్షం, ఇతర వాతావరణ సమస్యలను తట్టుకుని పిచ్ ను మ్యాచ్ కోసం మంచి స్థితిలో ఉంచడానికి శతవిధాలా ట్రై చేస్తారు. ఐపీఎల్ 17వ సీజన్ లో కూడా వీరి పాత్ర మరవలేనిది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా ఒక కీలక ప్రకటన చేశారు. ‘ మా ఐపీఎల్ లీగ్ గ్రాండ్ సక్సెస్ కావడంలో నిజమైన హీరోలు గ్రౌండ్ స్టాఫ్. చాలా క్లిష్ట పరిస్థితుల్లో పిచ్ బాగు చేయడానికి వారందరూ ఎంతో కష్టపడ్డారు. మీ కృషికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని జై షా ప్రకటించారు. బీసీసీఐ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles