పెళ్లి ఊరేగింపులో వధూవరులపై పూల వర్షం కురిపించడం గురించి మనకు తెలిసిందే.. కానీ ఉత్తర ప్రదేశ్ లోని ఓ పెళ్లి బారాత్ లో నవ వధూవరులపై నోట్ల వర్షం కురించారు. మగ పెళ్లివారి తరఫున విచ్చేసిన అతిథులు కొందరు కరెన్సీ నోట్లను చిత్తు కాగితాల లాగా నవ దంపతులపై విసిరేశారు. జేసీబీల పైకెక్కి, బంగ్లా పై నుంచి రూ.100, 200, 500 నోట్లను గాల్లోకి విసిరారు. ఏకంగా రూ.20 లక్షలను ఇలా వర్షంలా కురిపించారు.