Rice Washed Water: బియ్యం కడిగిన నీళ్లతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

|

Feb 21, 2024 | 3:03 PM

మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో రకాల అనారోగ్యాలకు పరిష్కారాలు మన వంటింట్లోనే లభిస్తుంటాయి. చాలా సార్లు మనం పనికిరానివిగా పారేసే వస్తువుల్లోనే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బియ్యం కడిగిన నీళ్లు కూడా అలాంటి పదార్ధాలలో ఒకటి అంటున్నారు. బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలుంటాయని.. డైటీషియన్లు చెబుతున్నారు. రైస్ ప్రపంచవ్యాప్తం గా పరిచయమైన ఫుడ్.

మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో రకాల అనారోగ్యాలకు పరిష్కారాలు మన వంటింట్లోనే లభిస్తుంటాయి. చాలా సార్లు మనం పనికిరానివిగా పారేసే వస్తువుల్లోనే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బియ్యం కడిగిన నీళ్లు కూడా అలాంటి పదార్ధాలలో ఒకటి అంటున్నారు. బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలుంటాయని.. డైటీషియన్లు చెబుతున్నారు. రైస్ ప్రపంచవ్యాప్తం గా పరిచయమైన ఫుడ్. ఆసియాలో ఎక్కువగా రైస్ తింటూ ఉంటారు. అన్నం వండటానికి ముందు రైస్‌ను రెండు, మూడు సార్లు కడుగుతారు. ఆ వాటర్‌ను పారబోస్తారు. కానీ ఈ వాటర్ లో ఉన్న మినరల్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు రైస్ వాటర్ ఇకపై అస్సలు పారబోయరు. బియ్యం కడిగిన నీటిలో కాటన్ లేదా శుభ్రమైన గుడ్డను ముంచి ముఖంపై అప్లై చేయడం వల్ల ముఖం మెరుస్తుందట. ఈ నీటిని స్కిన్ ఫేషియల్ గా కూడా ఉపయోగించవచ్చు. ముఖం ఎర్రబారడం, స్కిన్‌ అలర్జీలు వంటి సమస్యలు ఉన్నవారు బియ్యం కడిగిన నీటితో ముఖం కడుక్కుంటే ఫలితాలు ఉంటాయి. ఈ నీటిని జుట్టుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగడమే కాదు హెయిర్‌ ఫాల్‌ కూడా కంట్రోల్‌ అవుతుందట. బియ్యం కడిగిన నీటిలో లావెండర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టును కడగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

స్త్రీలు తెల్ల రుతుక్రమం సమస్యతో బాధపడుతుంటే ఈ రైస్ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే ఈ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు, బియ్యం కడిగిన నీరు తాగడం వల్ల కడుపులో మంట, విరేచనాలు తగ్గుతాయి. వేసవి కాలంలో చెమటకాయల సమస్యతో ఉన్నవారు బియ్యం కడిగిన నీటితో స్నానం చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నీటిలో ఉప్పు, నెయ్యి, ఎండుమిర్చి కలిపి తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది. రైస్ వాటర్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా మంచి హోం రెమెడీ కూడా. బియ్యం కడిగిన నీళ్లు తీసుకోవడం వల్ల వాంతులు, జ్వరంలాంటి సమస్యలు తొలగిపోతాయి. బియ్యం కడిగిన నీళ్లలో నారింజ తొక్క, నిమ్మతొక్క కలిపి తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండాకాలంలో ముఖం నల్లబడితే అలోవెరా జెల్, రోజ్ వాటర్‌, బియ్యం కడిగిన నీళ్లలో బాగా కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారువుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..