Snake Fight with Mongoose: నడిరోడ్డుపై ఎదురుపడిన బద్ధశత్రువులు.. ఆమడదూరంలో ఆగిపోయిన జనం?!!
పాము - ముంగిస.. ఇవి రెండూ ఆ జన్మ శత్రువులు. పాము-ముంగిస కొట్టుకుంటున్న వీడియోలు ఇప్పటి వరకూ చాలానే చూసి ఉంటారు. ఒకదానికొకటి ఎదురుపడ్డాయంటే.. ఇక భీకర యుద్ధం జరగాల్సిందే. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఎదురుపడినా.. బద్దశత్రువుల్లా కొట్టుకుంటాయి. వీటిమధ్య అంతటి వైరం ఎందుకు ఉందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. పాము- ముంగిసల పోరు మధ్యలోకి వెళ్లేందుకు..
పాము – ముంగిస.. ఇవి రెండూ ఆ జన్మ శత్రువులు. పాము-ముంగిస కొట్టుకుంటున్న వీడియోలు ఇప్పటి వరకూ చాలానే చూసి ఉంటారు. ఒకదానికొకటి ఎదురుపడ్డాయంటే.. ఇక భీకర యుద్ధం జరగాల్సిందే. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఎదురుపడినా.. బద్దశత్రువుల్లా కొట్టుకుంటాయి. వీటిమధ్య అంతటి వైరం ఎందుకు ఉందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. పాము- ముంగిసల పోరు మధ్యలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. చావో-రేవో తేలేంతవరకూ రెండూ ఒకదానిపై మరొకటి దాడి చేస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పట్టపగలు.. నడిరోడ్డుపై కనిపించిన త్రాచుపాముపై ముంగిస దాడి చేసేందుకు ప్రయత్నించగా.. త్రాచుపాము దానిపై ప్రతిదాడి చేసింది. రోడ్డుపై పడగవిప్పి ఉన్న త్రాచును చూసి.. అటుగా వెళ్లేవారు ఆమడదూరంలో ఆగిపోయారు. ఈ ఘటన మరెక్కడో కాదు.. మన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వెలుగుచూసింది. పడగవిప్పి ఉన్న త్రాచుపాముపై దాడి చేసేందుకు ముంగిస పరుగున రాగా.. అలర్టైన త్రాచు.. దానిపై బుసలు కొట్టింది. దెబ్బకు ముంగిస పరారైంది. ఆ తర్వాత కూడా త్రాచుపాము అక్కడే దాదాపు అరగంటసేపు బుసలు కొడుతూ ఉండటంతో స్థానికులు అటుగా వెళ్లేందుకు సాహసించలేదు. పాము పగబడితే.. అది చచ్చేంతవరకూ మరిచిపోదంటారు. అందులోనూ త్రాచుపాము పగ మరింత డేంజర్. అందుకే ఎవరూ కనీసం దానిని తరిమేందుకు కూడా ముందుకి రాలేదు. అటువైపు వెళ్లాల్సిన వాహనదారులు కూడా.. ఆ పాము దానంతట అదే శాంతించి వెళ్లేంతవరకూ వేచిచూశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతూ.. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి