కంటి దురదను వదిలించుకోవడానికి సింపుల్ టెక్నిక్స్ !

Updated on: May 11, 2025 | 9:28 AM

మొబైల్ ఎక్కువగా చూస్తున్నారా? దీనివల్ల వచ్చే సమస్యల కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల కంటి వాపు, ఇన్ఫెక్షన్లు, కంట్లో తరచు వాటర్ రావడం ఇలాంటివి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఇలా వస్తుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? సీజన్ తో సంబంధం లేకుండా చాలామందిని వేధించే సమస్య కంటి దురద సమస్య.

సాధారణ అలర్జీ నుంచి తీవ్ర అనారోగ్య సమస్య వరకు ఇలా కంటి దురదకు చాలా కారణాలు ఉంటాయి. పొడిగాలితో పాటు జీవనశైలి కూడా కొన్నిసార్లు కళ్ళలో అసౌకర్యానికి కారణం కావచ్చు. సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల వల్ల కూడా మీ కళ్ళకు వచ్చే సమస్యలు ఎన్నో ఉన్నాయి. మీరు పెంచుకునే కుక్క బొచ్చు వల్ల కూడా కంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వాటి దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి. అలర్జీ, దుమ్ము, ధూళి, పెంపుడు జంతువుల బొచ్చు, కొన్ని రకాల రసాయనాలు అలర్జీకి కారణం అవుతాయి. అలాంటప్పుడు కళ్ళు దురడటం, ఎరుపు ఎక్కడం, నీరు కారడం జరుగుతుంది. ఇలా అలర్జీ ఉన్నవారు దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం ఉత్తమం. మీకు తరచు కంట్లో నుంచి వాటర్ రావడం అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే స్క్రీనింగ్ ఎక్కువగా చూడటం, కాంటాక్ట్ లెన్స్ పెట్టడం ఇలాంటి వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ జరిగి కంట్లో నుంచి తరచు వాటర్ వస్తుంది. సో అలాంటివి కొంచెం తక్కువ చేసుకుంటే మంచిదే. కంటి ఇన్ఫెక్షన్లు, కాంజెక్టివైటిస్ ఇలాంటి బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా కళ్ళలో దురద, ఎరుపు, జిగురు లాంటి పదార్థాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లను సంప్రదించి వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం మంచిదే. బయట ఉండే దుమ్ము, ధూళి వల్ల కూడా కళ్ళు ఎరుపెక్కడం, జిగురు లాంటి పదార్థం కంట్లో నుంచి రావడం ఇలాంటివి కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. అందువల్ల మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్ ని సంప్రదించండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా ?? ఇదిగో క్లారిటీ

భార్య ముక్కు అందంగా ఉందని కొరికిన భర్త

రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

ఇది మితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.. మోతాదు మించితే హానికరం

వాల్ నట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసా ??