భార్య ముక్కు అందంగా ఉందని కొరికిన భర్త
నీ ముక్కు అందంగా ఉందని భర్త అంటే ఆ భార్య మురిసిపోయేది. నీ ముక్కు కొరికేస్తానని భర్త అంటుంటే ఏదో సరదాకు ఆట పట్టిస్తున్నాడని అనుకునేది. ఆఖరికి అన్నంత పనే చేస్తాడని ఊహించలేదు ఆ భార్య. వన్ ఫైన్ డే భార్య ముక్కు కొరికేశాడు భర్త. పశ్చిమ బెంగాల్ లో జరిగింది ఈ సంఘటన. నడియా జిల్లా శాంతిపూర్ పిఎస్ పరిధిలోని వేర్ పారోలో భార్య మధు ఖాతున్ ముక్కును కొరికేశాడు భర్త బాపన్ షేక్.
దీంతో లబోదిబోమని మొత్తుకుంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది భార్య మధు ఖాతున్. భార్య మధు ఖాతున్ అంటే భర్తకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె ముక్కు అంటే అతగాడికి తెగ ఇష్టమట. అవకాశం ఉంటే కొరుక్కు తింటానంటూ తరచు అనేవాడట. కానీ అన్నంత పని చేస్తాడని మాత్రం భార్య ఊహించుకోలేకపోయింది. ఈ నెల రెండున అర్ధరాత్రి బాపన్ షేక్, మధు ఖాతున్ ఇంట్లో నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. దీంతో స్థానికులు ఏం జరిగిందా అని ఆ ఇంటికి వద్దకు వచ్చారు. ఇంతలోనే మధు ఖాతున్ ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆమె ముక్కు నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుంది. ఏం జరిగిందని స్థానికులు ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని అంతా అవాక్కయిపోయారు. ఇదేం పని అంటూ ముక్కును వేలేసుకున్నారంతా. భార్య పడుకున్న సమయంలో భర్త బాపన్ షేక్ ఆమె ముక్కును కొరికేశాడు. వెంటనే మధు ఖాతున్ కి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటనపై తల్లితో కలిసి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన పోలీసులు కూడా అవాక్కయ్యారు. చివరకు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అందంగా ఉన్న భార్యను చూసి మురిసిపోవాల్సింది పోయి ముక్కు కొరకడం ఏంటంటూ అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
ఇది మితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.. మోతాదు మించితే హానికరం
వాల్ నట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

