Dantewada: నక్సలైట్లు కాల్పులు జరుపుతున్న షాకింగ్ వీడియో దృశ్యాలు.. (Watch Video)

Dantewada: నక్సలైట్లు కాల్పులు జరుపుతున్న షాకింగ్ వీడియో దృశ్యాలు.. (Watch Video)

Janardhan Veluru

|

Updated on: Apr 27, 2023 | 3:16 PM

దంతేవాడలో భారత జవాన్లపై నక్సలైట్లు జరిపిన కాల్పుల దృశ్యాలు ఎక్స్‌క్లూజీవ్‌గా టీవీ9కి లభించాయి.ఫైరింగ్‌ జరుగుతున్న దృశ్యాలను ఓ జవాన్‌ వీడియో తీశారు.

దంతేవాడలో భారత జవాన్లపై నక్సలైట్లు జరిపిన కాల్పుల దృశ్యాలు బయటకు వచ్చాయి. ఫైరింగ్‌ జరుగుతున్న దృశ్యాలను ఓ జవాన్‌ వీడియో తీశారు. నక్సలైట్లు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు, శబ్ధం క్లారిటీగా కనిపిస్తోంది. దాడి తర్వాత కూడా మావోయిస్టులు కాల్పులు కంటిన్యూ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే నక్సల్స్ సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న వాహనంపై దాడి చేసి, కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అప్పటికీ మావోయిస్టులను ఎదుర్కొనేందుకు శతవిధాలా బలగాలు ప్రయత్నించాయి. నక్సల్స్ జరిపిన ఈ దాడిలో 10 మంది సైనికులు, ఓ డ్రైవర్‌ వీరమరణం చెందడం తెలిసిందే. దాడి తర్వాత…వీడియో తీసిన జవానే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published on: Apr 27, 2023 03:16 PM