అద్భుతం : శివలింగంలా వెలిసిన పుట్ట.. వీడియో చూస్తే దండం పెట్టాల్సిందే!

Updated on: Aug 05, 2025 | 5:35 PM

శ్రావణమాసం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో శివుడిని పూజిస్తే, ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. అందుకే ఈ నెలలో శైవక్షేత్రాల్లో విశేషంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో శివాలయాలను సందర్శిస్తారు. కాగా శ్రావణ శుక్రవారం ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా చీమల పుట్టలో పాములు చేరతాయని చెబుతారు.

పాములను నాగదేవతగా కొలవడం హిందువుల సంప్రదాయం. అలాగే నాగుపాములు పరమశివునికి ఆభరణంగా ఉంటాయి. అయితే ఈ నాగేంద్రుడిని వెతుక్కుంటూ పరమశివుడు వచ్చాడా అన్నట్టుగా ఓ చీమల పుట్టపై శివలింగం ఆకారం ఏర్పడింది. ఈ అద్భుత ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. శ్రావణ శుక్రవారం వేళ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ అద్భుత సంఘటన వెలుగు చూసింది. జిల్లాలోని పెద్దబోనాల ప‌రిధిలో అరుదైన దృశ్యం అందరికీ కనువిందు చేసింది. శివ‌లింగం ఆకారంలో చీమ‌ల పుట్ట ప్రత్యక్షమైంది. శివలింగాన్ని తలపిస్తున్న ఆ చీమల పుట్టను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. సాధార‌ణ చీమ‌ల పుట్టల‌కు ఇది భిన్నంగా.. శివ‌లింగం ఆకారంలో ఉండ‌టంతో దానిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేశారు. గంటల వ్యవధిలోనే విషయం చుట్టు పక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది. పెద్దబోనాల స‌మీప ప్రాంత ప్రజ‌లు సైతం ఈ వింతను చూసేందుకు క్యూకట్టారు. కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

పాత, చినిగిన బట్టలు దాస్తున్నారా వీడియో

కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?

విశ్వానికి ముగింపు ఎప్పుడంటే వీడియో

తేళ్ల పంచమి.. వాటిని ముఖంపై వేసుకుని ఆటలు.. వామ్మో ఇదేం పండుగ వీడియో

Published on: Aug 05, 2025 04:55 PM