AP News: కంటైనర్‌ను ఆపిన పోలీసులు.. డౌట్ వచ్చి.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరేలా.!
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్‌లో డౌట్ వచ్చి..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్‌లో తరలిస్తున్న బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటిపైనే విలువున్న బంగారం, వెండి సీజ్ చేశారు. బంగారం అక్రమ రవాణాపై విచారణ జరిపి..చర్యలు తీసుకుంటామన్నారు డీఎస్పీ. అటు విజయనగరం జిల్లా గజపతినగరంలో కూడా పోలీసులు తనిఖీలు చేశారు.. గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్‌లో తనిఖీల్లో భాగంగా ఏడున్నర కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు ..పట్టుబడ్డ వెండికి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు.