Watch Video: పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి అర్బన్ పరిధిలో ఉన్న గోకవరం పోలీసులు వేసవి తాపానికి, చలువ పందిళ్లు వేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు ఎండలో మగ్గిపోతున్నారని ఉన్నతధికారుల దృష్టికి స్థానిక ఎస్ఐ కూన నాగరాజు తీసుకెళ్లారు. దీంతో ఎస్పీ జగదీశ్ చలువ పందిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనేపథ్యంలో పోలీస్ స్టేషన్లో మంచినీటి చలి వేంద్రంతో పాటు జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో లేని రీతిలో చలవ పందిళ్లను వేయించారు.
తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి అర్బన్ పరిధిలో ఉన్న గోకవరం పోలీసులు వేసవి తాపానికి, చలువ పందిళ్లు వేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు ఎండలో మగ్గిపోతున్నారని ఉన్నతధికారుల దృష్టికి స్థానిక ఎస్ఐ కూన నాగరాజు తీసుకెళ్లారు. దీంతో ఎస్పీ జగదీశ్ చలువ పందిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనేపథ్యంలో పోలీస్ స్టేషన్లో మంచినీటి చలి వేంద్రంతో పాటు జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో లేని రీతిలో చలవ పందిళ్లను వేయించారు. గోకవరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో తెలుగు సంప్రదాయం ఉట్టి పడేల పోలీసులు స్వయంగా పందిళ్ళను వేశారు. ఎండలో విధులు నిర్వహించి వచ్చిన పోలీసులు సిబ్బందికి, అటు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చే బాధితులు పందిరి కింద సేద తిరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తాటాకు చలువ పందిరి ఈ ఒక్క పోలీస్ స్టేషన్లో మాత్రమే ఉండడం విశేషం. ఏదీ ఏమైనా తెలుగు లోగింట్లలో, ఆలయాల ప్రాంగణాల్లో వేసే తాటాకు పందిళ్లు.. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో కనిపించడంతో గోకవరం పోలీసు సిబ్బంది పని తీరును ఉన్నతాధికారులు అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…