చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు

|

Apr 24, 2024 | 5:51 PM

తినేదీ ఆరోగ్యకరమైన ఆహారం. క్రమం తప్పకుండా వ్యాయామమూ చేస్తుంటారు. చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. అయినా ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతుంటారు. అదీ చిన్న వయసులోనే. గుండెపోటులో ఇదొక రకం. దీన్నే స్పాంటేనియస్‌ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్‌ (SCAD) అంటారు. యాబై ఏళ్లలోపు మహిళలలు ఎక్కకువగా దీనికి గురవుతుంటారు. సకాలంలో స్పందించి చికిత్స చేయకపోతే, ఇంత చిన్నవయసులో గుండెపోటు ఏంటని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

తినేదీ ఆరోగ్యకరమైన ఆహారం. క్రమం తప్పకుండా వ్యాయామమూ చేస్తుంటారు. చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. అయినా ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతుంటారు. అదీ చిన్న వయసులోనే. గుండెపోటులో ఇదొక రకం. దీన్నే స్పాంటేనియస్‌ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్‌ (SCAD) అంటారు. యాబై ఏళ్లలోపు మహిళలలు ఎక్కకువగా దీనికి గురవుతుంటారు. సకాలంలో స్పందించి చికిత్స చేయకపోతే, ఇంత చిన్నవయసులో గుండెపోటు ఏంటని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. సాధారణంగా రక్తనాళాల్లో పూడికలతో గుండెపోటు వస్తుంటుంది. కానీ SCAD తీరే వేరు. దీనికి మూలం రక్తనాళాల మధ్య ఉండే పొరలో చీలిక ఏర్పడటం. ఈ పొర చీలినప్పుడు రక్తం గూడు కట్టి, నాళం గోడ పొరలు విడిపోతాయి. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుంది. చాలావరకూ నెలసరి నిలవటానికి ముందు వయసులో.. 44 నుంచి 53 ఏళ్ల మధ్యలోనే ఇది తలెత్తుతుంది. ఇటీవల కాన్పు అయినవారిలోనూ 15 నుంచి 43 శాతం మంది దీని బారినపడుతున్నారు. SCAD కి హార్మోన్లు, ఇవి అనుసంధాన కణజాలాల మీద చూపే ప్రభావం కారణం కావొచ్చని భావిస్తున్నారు. రక్తనాళ గోడల్లో కణాలు అసాధారణంగా వృద్ధి చెందటం వంటివీ దీనికి దారితీయొచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??

ప్రభాస్‌ రూ. 35 లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి

రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ .. టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. స్మగ్లింగ్ చేయటానికి ఇంకేం దొరకలేదారా ??

24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు