Ratha Saptami: ఫిబ్రవరి 16న రథసప్తమి.. ఆ రోజు ఏమి చేయాలంటే ??

Ratha Saptami: ఫిబ్రవరి 16న రథసప్తమి.. ఆ రోజు ఏమి చేయాలంటే ??

Phani CH

|

Updated on: Feb 15, 2024 | 9:38 AM

భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. అంతేకాదు సూర్యుడిని ఆరోగ్యప్రదాతగా భావించి కొలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు భానుడిని విశేషంగా పూజిస్తారు. మాఘ మాసం శుక్ల పక్షం సప్తమి తిథి నాడు రథసప్తమిగా పరిగణించి సూర్యదేవుణ్ణి పూజిస్తారు. ఏడు గుర్రాలపై సంచరిస్తాడు కనుక రథ సప్తమి అని కూడా అంటారు.

భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. అంతేకాదు సూర్యుడిని ఆరోగ్యప్రదాతగా భావించి కొలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు భానుడిని విశేషంగా పూజిస్తారు. మాఘ మాసం శుక్ల పక్షం సప్తమి తిథి నాడు రథసప్తమిగా పరిగణించి సూర్యదేవుణ్ణి పూజిస్తారు. ఏడు గుర్రాలపై సంచరిస్తాడు కనుక రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది రథసప్తమి రోజునుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఫిబ్రవరి 16న రథ సప్తమి తిథిని ఆచరించేందుకు భక్తులు సిద్దమయ్యారు. రథసప్తమి రోజు త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. సూర్యోపాసన చేయదలచిన వాళ్లు.. షష్ఠి నాడు ఒంటిపూట భోజనం చేయాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2025 నాటికి భారత్‌ రానున్న ఫ్లయింగ్‌ కార్స్‌ !! ఇంటిపైనే ల్యాండింగ్

PM Surya Ghar Yojana 2024: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు.. కేంద్రం కొత్త పథకం ప్రారంభం