25 వేల మంది యాత్రికుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం

25 వేల మంది యాత్రికుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం

Phani CH

|

Updated on: Dec 31, 2023 | 7:31 PM

జ‌న‌వ‌రి 22న ఆల‌యాన్ని తెర‌వ‌నున్న నేపథ్యంలో అయోధ్య రామాల‌యం నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే ఆల‌యానికి వ‌చ్చే యాత్రికుల కోసం పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. సెంట‌ర్‌లో సుమారు 25వేల మంది ప‌ర్యాట‌కుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం ఉంటుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ తెలిపారు. పీఎఫ్‌సీ వ‌ద్ద ఓ చిన్న ఆస్ప‌త్రిని కూడా నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. టాయిలెట్‌తో పాటు ఇత‌ర అవ‌స‌రాల కోసం భారీ కాంప్లెక్స్‌ను కూడా కడుతున్నట్లు వెల్ల‌డించారు.

జ‌న‌వ‌రి 22న ఆల‌యాన్ని తెర‌వ‌నున్న నేపథ్యంలో అయోధ్య రామాల‌యం నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే ఆల‌యానికి వ‌చ్చే యాత్రికుల కోసం పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. సెంట‌ర్‌లో సుమారు 25వేల మంది ప‌ర్యాట‌కుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం ఉంటుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ తెలిపారు. పీఎఫ్‌సీ వ‌ద్ద ఓ చిన్న ఆస్ప‌త్రిని కూడా నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. టాయిలెట్‌తో పాటు ఇత‌ర అవ‌స‌రాల కోసం భారీ కాంప్లెక్స్‌ను కూడా కడుతున్నట్లు వెల్ల‌డించారు. కాంప్లెక్స్ నుంచి వ‌చ్చే వేస్ట్ మెటీరియ‌ల్ కోసం సీవెర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసారు. రామ‌జ‌న్మ‌భూమి ఆల‌యం కోసం 70 ఎక‌రాలు కేటాయించారు. ఆ స్థలంలో ఉత్త‌ర దిశ‌లో మూడు అంత‌స్థుల్లో ఆల‌యాన్ని నిర్మిస్తున్నారు. గుడికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ ప‌నులు పూర్తి అయ్యాయి. తొలి ఫ్లోర్ ప‌నులు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ట్లు చంప‌త్ రాయ్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం ట్ర‌స్టుకు భూమిని అందించ‌డం జ‌రిగిన‌ట్లు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి వింత శబ్దాలు.. పక్కకు తీసి చూస్తే

నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధం.. కొలువుతీరనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు