కిచెన్‌లో గ్యాస్ సిలిండర్ నుంచి వింత శబ్దాలు.. పక్కకు తీసి చూస్తే
ఉదయం లేవగానే కొందరు కిచెన్‌లోకి పరుగెడతారు. ఉద్యోగాలకు పరుగెత్తే వాళ్లు వంట చేసుకోడానికి హడావిడిగా కిచెన్‌లోకి పరుగెత్తుతారు. అలా ఓ మహిళ ఉదయాన్నే వంట చేసుకోడానికి వంటింట్లోకి వెళ్లిన మహిళకు అక్కడ వాతావరణం కాస్త తేడాగా అనిపించింది. నిశితంగా పరిశీలించిన ఆమెకు వింత శబ్ధాలు వినిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులను పిలిచింది. వారంతా కలిసి కిచెన్‌ను పరిళీంచి అక్కడ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా అదిరిపడ్డారు.
ఉదయం లేవగానే కొందరు కిచెన్‌లోకి పరుగెడతారు. ఉద్యోగాలకు పరుగెత్తే వాళ్లు వంట చేసుకోడానికి హడావిడిగా కిచెన్‌లోకి పరుగెత్తుతారు. అలా ఓ మహిళ ఉదయాన్నే వంట చేసుకోడానికి వంటింట్లోకి వెళ్లిన మహిళకు అక్కడ వాతావరణం కాస్త తేడాగా అనిపించింది. నిశితంగా పరిశీలించిన ఆమెకు వింత శబ్ధాలు వినిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులను పిలిచింది. వారంతా కలిసి కిచెన్‌ను పరిళీంచి అక్కడ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా అదిరిపడ్డారు. వెంటనే కిచెన్ వదిలి బయటకు లగెత్తారు. అసలేం జరిగిందంటే.. అనకాపల్లి జిల్లా సాలాపువానిపాలెంలోని ఓ ఇంట్లో వంటచేయడానికి కిచెన్‌లోకి వెళ్లిన మహిళకు వింత శబ్ధాలు వినిపించాయి. గ్యాస్ ఏమైనా లీకవుతుందేమోనని అంతా చెక్ చేసింది. ఎక్కడా గ్యాస్ లీకవుతున్నట్టు లేదు. కానీ అంతకంతకూ శబ్ధాలు ఎక్కువయ్యాయి. దాంతో ఆమె ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యులను పిలిచింది. కుటుంబ సభ్యులు గ్యాస్ సిలిండర్ దగ్గరనుంచి శబ్ధాలు రావడం గమనించి సిలిండర్ పక్కకు జరిపి చూశారు. అంతే ఒక్కసారిగా త్రాచుపాము బుసలు కొడుతూ పైకి లేచింది. వెంటనే అందరూ బయటకు పరుగుతీశారు. స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గ్యాస్ సిలిండర్ మాటున దాగి ఉన్న త్రాచుపామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. నాలుగున్నర అడుగుల పొడవైన ఆపామును సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధం.. కొలువుతీరనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు