కన్నడ హీరో స్పెషల్ పోస్ట్ వీడియో

Updated on: Oct 05, 2025 | 1:33 PM

కన్నడ హీరో రక్షిత్ శెట్టి 2021కి గాను కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో 777 చార్లీ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఈ సినిమా మొత్తం నాలుగు పురస్కారాలు సాధించింది. రక్షిత్ శెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, చిత్ర బృందానికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తాజాగా మరో గొప్ప ఘనత సాధించారు. 2021 సంవత్సరంలో సెన్సార్ అయిన చిత్రాలకు గాను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఆయన ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. 777 చార్లీ చిత్రంలో అద్భుతమైన నటనకు రక్షిత్ శెట్టి ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. ఇది రక్షిత్ శెట్టి అభిమానులకు, కన్నడ సినీ పరిశ్రమకు గర్వకారణం.రక్షిత్ శెట్టికి ఉత్తమ నటుడు అవార్డుతో పాటు, 777 చార్లీ చిత్రం మొత్తం నాలుగు పురస్కారాలను కైవసం చేసుకుంది. ఈ సినిమా ఉత్తమ రెండో చిత్రంగా నిలవడమే కాకుండా, ఉత్తమ ఎడిటర్ గా ప్రతీక్ శెట్టి, ఉత్తమ గేయ రచయితగా నాగార్జున శర్మ కూడా అవార్డులను అందుకున్నారు. ఈ విజయ పరంపరతో రక్షిత్ శెట్టి ఆనందంలో మునిగి తేలుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

జన నాయకుడికి తిప్పలు తప్పవా..? వీడియో

కుర్చీ మడతబెట్టి కొడితే 700 మిలియన్లు వీడియో

నీవి ఆ ఫోటోలు పంపిస్తావా..?’ నా కుమార్తెనే వేధించారు.. హీరో ఆవేదన వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో