చలికాలంలో ‘సూపర్ ఫుడ్’ వీడియో
రాగి, మఖానా, మునగ, ఉసిరి ఇలా పోషకాలతో నిండిన ఆహారపదార్థాలను సూపర్ ఫుడ్స్‌గా పిలుస్తారు. రాజ్‌గిరా కూడా సూపర్ ఫుడ్డే. ఈ తోటకూర గింజ .. వరి, జొన్న, మొక్కజొన్నల కంటే శక్తివంతమైంది. రాజ్‌గిరాను రామ్‌దానా అంటే దేవుడి కానుక అని కూడా అంటారు. దీన్ని తినడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగవుతుంది. ఉత్తరాదిన చలికాలంలో వీటి వాడకం ఎక్కువ. వ్రతాలు, ఉపవాసాల వేళ రాజ్‌గిరా పిండితో పూరీ, రోటీ, పాయసం వంటివి చేసుకుంటారు.
తోటకూర కుటుంబానికి చెందిన రాజ్‌గిరాను అమరాంత్ గ్రెయిన్ లేదా తోటకూర విత్తనాలు అంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వీటిని ఆహారంగా తీసుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నాయి.ఏ ఇతర ధాన్యంలోనూ లేని లైసీన్ అనే ప్రొటీన్ రాజ్‌గిరాలో పుష్కలంగా ఉంది. లైసీన్‌తో సహా కీలకమైన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయి. వంద గ్రాముల ధాన్యంలో సుమారు 15 గ్రా.ప్రొటీన్ లభిస్తుంది. ఈ ప్రొటీన్ ఇన్సులిన్ శాతాన్ని నియంత్రిస్తుంది. రాజ్‌గిరా మొలకల పిండి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. రాజ్‌గిరాలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. మహిళలు వీటిని ఆహారంలో చేర్చుకుంటే మెనోపాజ్ తర్వాత వచ్చే ఆస్టియోపొరోసిస్‌ను నివారించవచ్చని అంటున్నారు. వీటిల్లోని ఫోలేట్ గర్భిణులకు మంచిదని సూచిస్తున్నారు. ఇది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
