రక్తం తాగి బతికే వాంపైర్ గబ్బిలాలపై ప్రయోగం.. ఎందుకలా ??
గబ్బిలాలను చూస్తే చాలా మంది భయపడతారు. వాటి ఆకారం, రాత్రిపూట తిరగడం, చిన్నప్పుడు మన పెద్దవాళ్లు చెప్పే కథలు వంటివి దానికి కారణం. ఇలాంటి గబ్బిలాలలో కేవలం జంతువుల రక్తం తాగి బతికేవి ‘వాంపైర్ బ్యాట్స్’... అంటే రక్తపిశాచి గబ్బిలాలు అనొచ్చు. శాస్త్రవేత్తలు ఆ గబ్బిలాలను ఓ చిన్నపాటి ట్రెడ్ మిల్ పై పరుగెత్తిస్తున్నారు. మనకు మేలు చేసే కొన్ని అంశాలను గుర్తించేందుకు ప్రయోగం చేస్తున్నారు.
మామూలుగా జంతువులేవైనా బతకడానికి శక్తి అవసరం. తినే ఆహారం ద్వారా ఈ శక్తి అందుతుంది. దాదాపు అన్ని రకాల జంతువులు కూడా కొంచెం అటూ ఇటూగా శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆహారం తీసుకుంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, అమైనో యాసిడ్స్ వంటివన్నీ ఆ ఆహారం ద్వారా శరీరానికి అందేలా చూసుకుంటాయి. అన్ని పోషకాలు అందకపోతే… ఆరోగ్యం దెబ్బతింటుంది. వివిధ వ్యాధులు వస్తాయి. ఆ జీవులు కృశించిపోతాయి. ఈ విషయంలోనే వాంపైర్ బ్యాట్స్ లో తేడాను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాంపైర్ గబ్బిలాలు కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తాయి. వేరే ఆహారం ఏదీ తీసుకోవు. అలాంటప్పుడు వాటికి పోషకాహార లోపం రావాలి కదా, సాధారణంగా జంతువుల్లో కార్బోహైడ్రేట్ల ద్వారా శక్తి ఉత్పన్నం అవుతుంది. బ్యాట్స్ తాగే రక్తంలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్ ఎక్కువ. మరి వాటితో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందన్న ప్రశ్న తలెత్తింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా బ్రెయిన్‌లో మెషిన్ పెట్టారు.. డీ యాక్టివేట్ చేయండి !! ఏపీ టీచర్ వింత పిటిషన్
మహిళా కి”లేడీ”లు.. లోన్ పేరుతో భారీ దోపిడీ !!
వారెవా !! సోలార్ పవర్ కోసం స్పేస్ కే స్కెచ్చేసిన సైంటిస్టులు