చట్టం టీడీపీ వాళ్లకు ఒకలా.. వైసీపీ వాళ్లకు మరోలా పనిచేస్తోందంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ ఫైరయ్యారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించి వచ్చిన అసభ్యకర పోస్టింగులపై పోలీసు ఉన్నతాధికారులకు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు దీనిపై డీజీపీ, ఎస్పీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అయితే వైసీపీకి సంబంధించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.