నిర్మల్ జిల్లాలో గత 20 రోజులుగా సంచరిస్తున్న బెబ్బులి.. నర్సాపూర్, మామడ, పెంబి రేంజ్ లు దాటుకుంటూ కవ్వాల్ అభయారణ్యం వైపు అడుగులు వేస్తోంది. సంచారంలో ఎదురు పడుతున్న పశువుల మందలపై దాడి చేస్తూ ఆవులు , గేదేలను హతమారుస్తోంది. 20 రోజుల వ్యవధిలో 8 పశువులను హతమార్చింది బెబ్బులి. ఆడ తోడు కోసం ప్రయాణం చేస్తున్న ఆరున్నరేళ్ల పగ పులి గుర్తించింది అటవిశాఖ.