AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Droupadi Murmu: శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము.. ప్రత్యేక పూజలు

Droupadi Murmu: శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము.. ప్రత్యేక పూజలు

Krishna S
|

Updated on: Oct 22, 2025 | 12:57 PM

Share

ద్రౌపది ముర్ము గణపతి ఆలయంలో ఇరుముడిని సిద్ధం చేసుకుని, సన్నిధానంకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్పకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె దేవస్వం అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమలకు వెళ్లారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఇవాళ ఉదయం ఆమె హెలికాఫ్టర్‌లో పతనంతిట్ట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంపాకు వెళ్లారు. పంపాలో తన పాదాలను కడుక్కోవడం ద్వారా సాంప్రదాయ శుద్ధి ఆచారాన్ని పాటించారు. అనంతరం ఆమె గణపతి ఆలయంలో ఇరుముడిని సిద్ధం చేసుకుని, సన్నిధానంకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్పకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె దేవస్వం అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 3:10 గంటలకు సన్నిధానం నుండి బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో నీలక్కల్ నుండి తిరువనంతపురం వెళ్తారు.

అందకుముందు ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ స్వల్ప ప్రమాదానికి గురైంది. పతనంతిట్ట సమీపంలో ఉన్న ప్రమదం వద్ద ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం 9.05 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొత్తగా సిద్ధం చేసిన హెలిప్యాడ్‌పై సురక్షితంగా దిగింది. అయితే రాష్ట్రపతి దిగిన వెంటనే, ఆ హెలికాప్టర్ యొక్క టైర్లు కొత్తగా వేసిన కాంక్రీట్ ఉపరితలంలోకి కొద్దిగా కుంగిపోయాయి. ఆ తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది హెలికాఫ్టర్‌ను బయటకు తీశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి