Watch Video: రాజకీయ సన్యాసం సవాలుపై మాజీ మంత్రి అనిల్ ఆసక్తికర కామెంట్స్
రాజకీయ సన్యాసంపై తాను సవాల్ చేసిన మాట వాస్తవమని మాజీ మంత్రి అనిల్ అన్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ తన సవాల్‌ను స్వీకరించనందున.. సవాలుకు కట్టుబడాల్సిన అవసరం లేదన్నారు. నరసరావు పేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్.. అక్కడ తాను ఓడిపోతే రాజకీయ సన్యానం తీసుకుంటానని సవాలు చేశారు.
రాజకీయ సన్యాసంపై తాను సవాల్ చేసిన మాట వాస్తవమని మాజీ మంత్రి అనిల్ అన్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ తన సవాల్‌ను స్వీకరించలేదన్నారు. నరసరావు పేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్.. అక్కడ తాను ఓడిపోతే రాజకీయ సన్యానం తీసుకుంటానని గతంలో సవాలు చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేయడంపై స్పందిస్తూ.. టీడీపీ వాళ్లు ఎంత ట్రోల్ చేసినా తనకు ఇబ్బంది లేదన్నారు. ట్రోల్స్‌తో పబ్లిసిటీయే తప్ప తనకు నష్టమేం లేదన్నారు. వైసీపీ శ్రేణులపై దాడులు చేయడం సరికాదని.. ఎవ్వరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని గుర్తుపెట్టుకోవాలన్నారు. తాము అన్నింటికీ సిద్ధపడే ఉన్నామన్నారు. ఒక్క ఓటమితో అంతా అయిపోదన్న అనిల్.. 2029లో వాళ్లు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదన్నారు.
మొన్నటి ఎన్నికల్లో ఏపీలో 40 శాతం మంది ప్రజలు వైసీపీ వైపు నిలిచారన్నారు. ప్రతిపక్షం తమకు కొత్త కాదన్నారు. ఓటమైనా, గెలుపైనా రాజకీయాల్లో అంగీకరించాల్సిందే అన్నారు. 2009 నుంచి 2019 దాకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నామన్నారు. ఐదేళ్లు మాత్రమే తాము అధికారంలో ఉన్నామని.. ఓడిపోయానని కుంగిపోయేది లేదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా జగన్ వెంటే ఉంటామన్నారు. ఎన్నికల్లో కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారని.. హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మాలో లోపాలను సరిదిద్దుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతామన్నారు.