CM Jagan: ‘చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం సీఎం జగన్ విధానం’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్..
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తమ స్టార్ క్యాంపెయినర్లు అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలోతన నివాసంలో ఇచ్చిన ఇంటర్వూలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఆయన అమలు చేసే ఉద్దేశం లేదుకనుకనే ఎలాంటి హామీలైనా ఇస్తాన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ. 26వేల డ్వాక్రా రుణాలను సీఎం జగన్ రుణ మాఫీ చేశారన్నారు.

వైసీపీ పాలనలో రూ. 2.58లక్షల కోట్లు డిబిటి ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమచేశామన్నారు. తాము చెప్పిన హామీల అమలుకు ప్రతి ఏటా రూ. 70 వేల కోట్లు అవుతుందన్నారు. అదే చంద్రబాబు చెప్పే హామీలు అమలు చేయాలంటే ప్రతి ఏటా రూ. 1.20 లక్షల కోట్లు అవుతుందని లెక్కలు చెప్పారు. 2014-19 మధ్య పాలనలో చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసని తెలిపారు. జనం తనను తిరస్కరిస్తారని చంద్రబాబుకు బాగా అర్థమైపోయిందని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే పల్లెల రూపం మారిందన్నారు. చేయగలిగిందే చెప్పి ఆదర్శపాలన అందించారు సీఎం జగన్ అని కొనియాడారు. చంద్రబాబు, జగన్ ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..