Watch Video: జగన్‌ను ఓడించేందుకు వారంతా ఏకమయ్యారు.. కూటమి నేతలపై పోసాని ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో ఒక్క జగన్‌ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్, మోదీ సహా.. 17, 18 మంది లీడర్లు ఏకమయ్యారని పోసాని అన్నారు. వీరంతా ఏపీకి టైంపాస్ కోసం వచ్చి వెళ్లే వారని విమర్శించారు. జగన్‌ను తిట్టేందుకు తప్ప.. ప్రజల బాగుకోసం ఎవ్వరూ పనిచెయ్యరన్నారు.
ఏపీలో ఒక్క జగన్‌ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్, మోదీ సహా.. 17, 18 మంది లీడర్లు ఏకమయ్యారని పోసాని అన్నారు. వీరంతా ఏపీకి టైంపాస్ కోసం వచ్చి వెళ్లే వారని విమర్శించారు. జగన్‌ను తిట్టేందుకు తప్ప.. ప్రజల బాగుకోసం ఎవ్వరూ పనిచెయ్యరన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరూ ఏకం అయ్యారని ఎద్దేవా చేశారు. వీరు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోసాని మండిపడ్డారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా టైంలో ఈ 17మంది నాయకులు ఎక్కడికి వెళ్లారని పోసాని ప్రశ్నించారు. విపత్కర కాలంలో ప్రజలకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. కరోనా టైంలోనూ జగన్ ఏపీ ప్రజల్ని కడుపున పెట్టుకుని కాపాడుకున్నారని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు పోసాని.
Published on: May 11, 2024 11:45 AM
వైరల్ వీడియోలు
Latest Videos