Weekend Hour: MLC రిజల్ట్స్‌తో AP పాలిటిక్స్‌లో కాక.. ఫలితాలపై ఎవరి వాదన వాళ్లదే

|

Mar 19, 2023 | 7:05 PM

MLC ఎన్నికల రిజల్ట్స్‌తో APపాలిటిక్స్‌లో కాక మొదలైంది.! ఇది ముమ్మాటికి ప్రభుత్వంపై తిరుగుబాటే అంటోంది తెలుగుదేశం. అంతసీన్‌ లేదని కౌంటర్ ఇస్తోంది YCP. విపక్షాలను తోడేళ్ల మందతో పోల్చిన CM జగన్ .. ప్రజలకు హీరోలు మాత్రమే నచ్చుతారు.. విలన్లు కాదని స్పష్టం చేశారు.

ఏపీ రాజకీయాల్లో హైవోల్టేజ్ హీట్‌ మొదలైంది. MLC రిజల్ట్స్‌పై ఎవరి వాదన వాళ్లు బలంగానే వినిపిస్తున్నారు. ఇటీవల జరిగిన MLC ఎన్నికల్లో స్థానిక సంస్థలను YCP క్లీన్ స్వీప్ చేసింది. 2 టీచర్ సీట్లను కూడా గెల్చుకుంది. అయితే పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాత్రం ఊహించని ఫలితాలు వచ్చాయి. మూడుకు మూడు సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా 2024 ఎన్నికల చుట్టూ చర్చ మొదలైంది.! అయితే విపక్షాలకు అంతసీన్‌ లేదంటోంది అధికార YCP. తాత్కాలికంగా విలన్లు గెలిచినా.. అంతమ విజయం హీరోదే అన్నది ఆ పార్టీ వర్షన్..!