Weekend Hour: రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్.. భయపడను.. బెదరను.. వెనక్కి తగ్గను..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మోడీ ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మోడీ ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్ సభ సచివాలయం రాహుల్ పై చర్యలు తీసుకుంది. కాగా, కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అనర్హత పరిణామాల అనంతరం రాహుల్ గాంధీ.. తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదంటూ స్పష్టంచేశారు. మోడీ-ఆదానీ సంబంధం బయటపడాలన్నారు. వారిద్దరి మధ్య సంబంధం గురించి వెలుగురావాలని డిమాండ్ చేశారు. తాను ఎవరికీ భయపడనని.. అన్ని సాక్ష్యాలు పార్లమెంటుకు సమర్పించానని తెలిపారు. అప్పటినుంచే తనపై కుట్రపన్నారంటూ ఆరోపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో