Weekend Hour: వైఎస్‌ఆరే కావాలి.. కాంగ్రెస్సే రావాలి..! వైఎస్‌ఆర్‌ వారసత్వం కోసం కాంగ్రెస్‌ పాకులాడుతోందా..?

|

Sep 03, 2023 | 6:57 PM

Weekend Hour With Murali Krishna: అటు కేంద్రంలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా అధికారం కోల్పోయి అల్లాడుతున్న కాంగ్రెస్‌ పునర్వైభవం కోసం పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో పక్కన పెట్టిన వ్యక్తికి ఇప్పుడు నివాళులర్పిస్తూ కొనియాడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ మళ్లీ గుర్తుకువచ్చారు. మొన్న ఆయన జయంతి నుంచి నిన్న వర్థంతి వరకు..

Weekend Hour: వైఎస్‌ఆరే కావాలి.. కాంగ్రెస్సే రావాలి..! వైఎస్‌ఆర్‌ వారసత్వం కోసం కాంగ్రెస్‌ పాకులాడుతోందా..?
Weekend Hour
Follow us on

Weekend Hour With Murali Krishna: అటు కేంద్రంలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా అధికారం కోల్పోయి అల్లాడుతున్న కాంగ్రెస్‌ పునర్వైభవం కోసం పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో పక్కన పెట్టిన వ్యక్తికి ఇప్పుడు నివాళులర్పిస్తూ కొనియాడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ మళ్లీ గుర్తుకువచ్చారు. మొన్న ఆయన జయంతి నుంచి నిన్న వర్థంతి వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌ ముఖ్యులు వైఎస్‌ఆర్‌కు నివాళి అర్పించిన పరిస్థితి. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ గుర్తు చేసుకుంటూ కొనియాడారు. పక్కా వ్యూహంతోనే కాంగ్రెస్‌ నాయకత్వం వైఎస్‌ఆర్‌ను ఓన్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా వైఎస్‌ఆర్‌ను గుర్తు చేసుకుంటూ రూపొందించిన రైతే రాజైతే పుస్తకావిష్కరణ సభలో వైఎస్‌ఆర్‌ గొప్పదనాన్ని కాంగ్రెస్‌ నాయకులు గుర్తు చేసుకున్నారు.

ఇరవై ఏళ్ల పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ఆర్‌ నేటి తరానికి ఆదర్శమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా కొనియాడారు.

అదే సమయంలో YSR మరణించిన తర్వాత ఆయన పేరును FIRలో చేర్చడంపై నెలకొన్న రచ్చ, మచ్చను తుడుచుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం YSR కుమార్తె షర్మిలను కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా రంగంలోకి దించుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఎన్నికల వేళ ఇప్పటికీ చెక్కు చెదరని వైఎస్సార్ ఓట్ బ్యాంకు ను తిరిగి తమ వైపు తిప్పుకోవటమే కాంగ్రెస్ ముందున్న లక్ష్యం. ఇందు కోసం షర్మిల ద్వారా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకోవాలన్నది కాంగ్రెస్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. పొగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్న సామెతను గుర్తు చేసుకుంటూ వైఎస్‌ఆర్‌ వారసత్వాన్ని ఓన్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

వీకెండ్ హౌర్ విత్ మురళీకృష్ణ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.