Nara Lokesh: నిడమర్రు మండలం భువనపల్లిలో లోకేష్ క్యాంపు సైట్ వద్ద ఉద్రిక్తత

Nara Lokesh: నిడమర్రు మండలం భువనపల్లిలో లోకేష్ క్యాంపు సైట్ వద్ద ఉద్రిక్తత

Ram Naramaneni

|

Updated on: Sep 03, 2023 | 5:33 PM

ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో ఉద్రిక్తత నెలకొంది. లోకేష్ యువగళం పాదయాత్రకు బైక్‌లు అడ్డు పెట్టారంటూ గొడవ జరిగింది. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పరస్పరం రాళ్లు కూడా రువ్వుకున్నారు.. పాదయాత్రకు వైసీపీ నాయకులు కావాలనేబైక్‌లు అడ్డుపెట్టారంటున్నారు టీడీపీ వర్గీయులు. - వైసీపీ కార్యకర్తలతో గొడవకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఘర్షణ మరింత ముదరకుండా ఇరువర్గాలను కంట్రోల్ చేసారు. ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఏలూరు జిల్లా నిడమర్రు మండలం భువనపల్లిలో లోకేష్ క్యాంప్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలపై దాడి చేసిన యువగళం కార్యకర్తను తమతో పంపించాలని కోరారు పోలీసులు. అందుకు టీడీపీ నేతలు అంగీకరించలేదు. పైగా అనుమతి లేకుండా తమ క్యాంప్‌కి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో టెన్షన్ పరిస్థితి నెలకొంది. అంతకుముందు యువగళం పాదయాత్రకు బైక్‌లు అడ్డు పెట్టరాంటూ గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకులు కావాలనే బైక్‌లు అడ్డుపెట్టారని ఆరోపించారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Published on: Sep 03, 2023 05:33 PM