Chirala: కరణం వర్సెస్ ఆమంచి.. మాటల తూటాలు.. చీరాలలో వేడెక్కిన రాజకీయం

Chirala: కరణం వర్సెస్ ఆమంచి.. మాటల తూటాలు.. చీరాలలో వేడెక్కిన రాజకీయం

Ram Naramaneni

|

Updated on: Sep 03, 2023 | 5:20 PM

చీరాల రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌, పర్చూరు వైసీపీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రామన్నపేట పంచాయతీ ఉప ఎన్నికల సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. తాజా వైఎస్సార్‌ వర్ధంతి సభలో కరణం వెంకటేష్‌ ఆమంచి బ్రదర్స్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్‌గా జనసేన నాయకుడిగా ఉన్న ఆమంచి స్వాములు పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు వేడుకల్లో కౌంటర్‌ ఇచ్చారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చీరాలలో పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. రామన్నపేట పంచాయతీ ఉప ఎన్నికల నాటి నుంచి చీరాల వైసీపీ ఇంచార్జ్‌ కరణం వెంకటేష్, ఆమంచి సోదరుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న వైఎస్సార్‌ వర్ధంతి సభలో కరణం వెంకటేష్‌ ఆమంచి బ్రదర్స్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతికి భంగం కలిగిస్తే పరిగెత్తించి కొడతానని కరణం వెంకటేష్ హెచ్చరించారు. కరణం వ్యాఖ్యలకు రీవర్స్ కౌంటర్‌ ఇచ్చారు జనసేన నేత ఆమంచి స్వాములు. ఛాలెంజ్‌లు విసురుకోవడం, తొడలు పగలకొట్టుకోవడం మనకు అవసరం లేదు. టైమ్ వచ్చినప్పుడు ఎవరేంటో జనాలే నిర్ణయిస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.