Kishan Reddy: అగ్నిపథ్ యువతకు వ్యతిరేకం కాదు.. కుట్రపూరితంగానే అగ్నిపథ్‌పై ప్రచారం: కిషన్ రెడ్డి

| Edited By: Ravi Kiran

Jun 17, 2022 | 5:18 PM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అల్లర్లకు సంబంధించి.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం పదండి

ఆర్మీ నియామకాలకు సంబంధించి.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం అగ్గిరాజేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మిన్నంటుతున్న ఆందోళనలు తెలంగాణను టచ్‌ చేశాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ముట్టడించిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఆగ్రహంతో రగిలిపోతూ స్టేషన్‌లో ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు.

Published on: Jun 17, 2022 02:44 PM