Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

|

Sep 27, 2024 | 9:23 PM

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థల చైర్మన్లు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో..

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థల చైర్మన్లు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అంశాలపై కేంద్ర సహాయ మంత్రి వర్మ వారితో చర్చించారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, NMDCతో చర్చలు జరుగుతున్నాయని.. అయితే విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నాయన్నారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చూడటానికి తెలుగు రాష్ట్రానికి చెందిన మంత్రిగా తనపై పైఒత్తిడితో పాటు బాధ్యత కూడా ఉందని అందుకే అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామంటున్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.

ఇది చదవండి: ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..