Watch: జగన్‌ను మానసికంగా హింసించే కుట్ర - అంబటి రాంబాబు

Watch: జగన్‌ను మానసికంగా హింసించే కుట్ర – అంబటి రాంబాబు

Janardhan Veluru

|

Updated on: Sep 28, 2024 | 12:53 PM

జగన్ గతంలోనూ శ్రీవారి దర్శనం చేసుకున్నారని.. అప్పుడు లేని డిక్లరేషన్ నిబంధన ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. జగన్‌ను మానసికంగా హింసించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆ పాపం ప్రజలకు తగలకూడదని పూజలు చేశామని తెలిపారు.

జగన్ గతంలోనూ శ్రీవారి దర్శనం చేసుకున్నారని.. అప్పుడు లేని డిక్లరేషన్ నిబంధన ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్‌ను మానసికంగా హింసించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆ పాపం ప్రజలకు తగలకూడదని పూజలు చేశామని తెలిపారు.

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాయి. తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రకు భంగం కలిగించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.