Tirupati: స్మశానం కబ్జా..మహిళ అంత్యక్రియలకు అడ్డంకి.. ఉద్రిక్తత వాతావరణం.. చివరికి ఎం జరిగింది..?(వీడియో)

|

Oct 15, 2021 | 7:13 PM

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిట్టమీద కండ్రిగ గ్రామానికి చెందిన స్మశానం కబ్జా వ్యవహారం పై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామంలోని స్మశానాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారు.

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిట్టమీద కండ్రిగ గ్రామానికి చెందిన స్మశానం కబ్జా వ్యవహారం పై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామంలోని స్మశానాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఓ మహిళ మృతదేహాన్ని ఖననం చేసేందుకు వెళ్లిన గ్రామస్తులను కబ్జాదారులు అడ్డుకున్నారు. స్మశానానికి ఫెన్సింగ్ వేసి లోపలకు వెళ్లనివ్వలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో స్మశాన స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆక్రమణకు గురైన స్మశాన స్థలాన్ని కాపాడకపోతే మృతదేహంతో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : Water in Theater: శివగంగ థియేటర్‌లో పొంగిన గంగ.. వైరల్ అవుతున్న వీడియో..

 Gorilla in caretakers lap: సంరక్షుడి ఒడిలో ప్రాణాలొదిన సెలబ్రిటీ గొరిల్లా.. హృదయాలను కదిలిస్తున్న గొరిల్లా మరణం వీడియో..

 News Watch: కోతలొద్దు, మా వాటా వాడుకోండి , తొందర్లోనే పిల్లలకు టీకా.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్