Telangana Unlock : తెలంగాణలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం.. ( వీడియో )
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మంత్రులందరూ ఒకే చెప్పడంతో ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 20 నుంచి అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అన్‌లాక్ గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
*బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి.
*మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా.
*ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి.
*భౌతిక దూరం, శానిటైజేషన్ తప్పనిసరి.
*జూలై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరిచేందుకు అనుమతి.
*ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
మరిన్ని ఇక్కడ చూడండి: Tollywood: తెలుగు సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన స్టార్స్ వీరే .. ( వీడియో )
ఘోర రోడ్డు ప్రమాదం చనిపోయిన తన తల్లికి, చెల్లికి అంత్యక్రియలు చేసిన యువ వైద్యురాలు.. ( వీడియో)
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
