రాష్ట్రం విడిపోయి చాలాకాలం అయినా తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య అప్పడప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తెలంగాణ డెవలప్‌మెంట్‌ను ప్రశంసించే సమయంలో కొందరు టీఆర్‌ఎస్ మంత్రులు.. ఏపీ నాయకుల్ని విమర్శిస్తూ ఉన్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. ఆంధ్రాలో కరెంటు లేక.. తీగలపై బట్టలు ఆరేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలో భూముల రేట్లు ఓ రేంజ్‌లో పెరిగితే.. ఏపీలో మాత్రం పడిపోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో ఎకరాల కొద్ది ల్యాండ్ దొరుకుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రజంట్ ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి.