ప్రజల మనసులో ఉన్న మాటే చెప్పా.. ‘రేవంత్ కాబోయే సీఎం’ వ్యాఖ్యలకు రామ్మోహన్ వివరణ
Telangana Elections: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రసంగాన్ని అనువాదం చేసిన పరిగి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి.. రేవంత్‌పై తనకున్న అభిమానాన్ని కూడా అందులో కలిపేశారు. దీంతో ఆ అనువాదం ఇప్పుడు వివాదంగా మారింది. ఇంగ్లీష్‌లో మాట్లాడిన డీకే వ్యాఖ్యలను తెలుగులో అనువాదం చేసే క్రమంలో డీకే అనని మాటలను కూడా అనేశారు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రసంగాన్ని అనువాదం చేసిన పరిగి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి.. రేవంత్‌పై తనకున్న అభిమానాన్ని కూడా అందులో కలిపేశారు. దీంతో ఆ అనువాదం ఇప్పుడు వివాదంగా మారింది. ఇంగ్లీష్‌లో మాట్లాడిన డీకే వ్యాఖ్యలను తెలుగులో అనువాదం చేసే క్రమంలో డీకే అనని మాటలను కూడా అనేశారు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి. ఒక్కసారి అంటే ఏదో పొరపాటున అనుకోవచ్చు కానీ.. డీకే శివకుమార్ చెప్పకపోయినా మూడు సార్లు రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అంటూ చెప్పారు. తెలంగాణ ప్రజల మనసులో ఉన్న మాటే తాను చెప్పానంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రామ్మోహన్ రెడ్డి. టీవీ9తో మాట్లాడిన ఆయన.. రేవంత్‌రెడ్డికి సీఎం అయ్యే పూర్తి అర్హత ఉందన్నారు. డీకే శివకుమార్ అధ్యర్వంలో కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అందుకే అలా చెప్పా అంటున్నారు రామ్మోహన్‌రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు.