Telangana: భద్రాద్రి రాముడి సాక్షిగా రుణమాఫీపై రైతులకు రేవంత్ గుడ్ న్యూస్.. మరో శుభవార్త కూడా
పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను అయ్య, మామ పేరు చెప్పుకుని అధికారంలోకి రాలేదని.. బరాబర్ జనంలో నుంచి వచ్చినట్లు తెలిపారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోగా చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
పదేళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల అండతో కుర్చీపై కూర్చున్నామని, తమని ఎవరూ కదపలేరని మహబూబాబాద్ జనజాతర సభలో చెప్పుకొచ్చారు. ఆగస్ట్ 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భద్రాద్రి రాముడి సాక్షిగా మాట ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చి రుణమాఫీ చేయలేకపోయామని అన్నారు. రైతులకు వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ కచ్చితంగా అందిస్తామన్నారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 19, 2024 06:51 PM