Telangana Assembly: తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు.. లైవ్ వీడియో

|

Dec 16, 2024 | 10:17 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఉదయం పది గంటలకు శాసన సభ, శాసన మండలి ప్రారంభమైంది.. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఉదయం పది గంటలకు శాసన మండలి, శాసనసభ ప్రారంభమైంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.. ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్‌ భేటీ ఉండనుంది.. స్పోర్ట్స్‌, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులతోపాటు.. టూరిజం పాలసీపై చర్చ ఉండే అవకాశం ఉంది.. ఈ సమావేశంలో ROR, పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ బిల్లుపై చర్చ నిర్వహించనున్నారు.

ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తీసుకోవాలని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా విధి విధానాలపై ఈ మధ్యే సిఫార్సులు చేసింది కేబినెట్ సబ్ కమిటీ. వాటిపై చర్చించి విధివిధానాలు ఖరారు చేయబోతుంది మంత్రివర్గం.

కాగా.. ఈ నెల ఒక రోజు అసెంబ్లీ సమావేశమైంది. అనంతరం సభ వాయిదా పడింది. తిరిగి ఇవాళ్టి నుంచి సభ ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఇవాళ్టి BAC సమావేశంలో నిర్ణయిస్తారు. ఐదు రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బిల్లులను ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి..

క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతుంది. ఈ శాఖలను స్వయంగా చూస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ చేపడతారు. రాష్ట్రంలో ఆకర్షణీయమైన స్థలాలు, ఆలయాలు ఉన్నాయి. అయినా ఆశించిన స్థాయిలో పర్యాటక అభివృద్ధి జరగలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై ఇటీవలే అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నెలాఖరు నాటికి కొత్త పర్యాటక పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పర్యాటక విధానంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.

Published on: Dec 16, 2024 10:16 AM