విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌లో ఏం జరుగుతోంది?.. MLA కేతిరెడ్డిని ప్రశ్నించిన పరిటాల శ్రీరామ్

విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌లో ఏం జరుగుతోంది?.. MLA కేతిరెడ్డిని ప్రశ్నించిన పరిటాల శ్రీరామ్

Janardhan Veluru

|

Updated on: Apr 04, 2023 | 5:21 PM

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు పరిటాల శ్రీరామ్‌. 25 ఎకరాలు కొన్నా అంటున్న ఎమ్మెల్యే విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు.

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్‌ సంచలన ఆరోపణలు చేశారు. 25 ఎకరాలు రైతుల దగ్గరి నుంచి కొన్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి.. అక్కడ నిర్మించిన విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. పది ఎకరాలతో మొదలై ఇప్పుడు 100 నుంచి 150 ఎకరాల భూములు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌ కాదు.. పెద్దగా వ్యాపారం లేదు… ఏ పనీ లేదు అలాంటి వ్యక్తి వందల ఎకరాలు, ఆస్తులు సంపాదించారన్నారు. మరదలు, తమ్ముడి పేరుతో ఆస్తులు కూడబెట్టారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.

Published on: Apr 04, 2023 04:56 PM