TDP: నూజివీడు టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి
మొన్న చంద్రబాబును కలిసినా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. తన ఆవేదనను వెళ్లగక్కినట్లు సమాచారం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్థసారధికి ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపుకు పనిచేయాలని సూచించినట్లు సమాచారం. అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్న ముద్దరబోయిన వెనక్కి తగ్గే పరిస్థితి కనబటం లేదు.
ఏలూరు జిల్లా టీడీపీలో నెలకొన్న టికెట్ల లొల్లికి చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినా.. నూజివీడులో అసమ్మతి చల్లారే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పటికే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత కాపా శ్రీనివాసరావు ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. టీడీపీ తీరుపై మండిపడ్డారు. పార్టీని తిట్టినవాళ్లకి టికెట్ ఇస్తున్నారు. పనిచేసే వారిని పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాపా శ్రీనివాసరావు.
మరోవైపు మొన్న చంద్రబాబును కలిసినా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. తన ఆవేదనను వెళ్లగక్కినట్లు సమాచారం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్థసారధికి ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపుకు పనిచేయాలని సూచించినట్లు సమాచారం. అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్న ముద్దరబోయిన వెనక్కి తగ్గే పరిస్థితి కనబటం లేదు. తన మద్దతుదారులతో సమావేశమై పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కొందరు పార్థసారధి రాకను వ్యతిరేకిస్తున్నారు. సారధి కోసం కట్టిన స్వాగత ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నూజివీడు టికెట్ సారథికి ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. అయితే త్వరలోనే అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి విజయం సాధించి తీరతానని పార్థసారథి చెబుతున్నారు.
ముద్ర బోయిన వెంకటేశ్వరరావు పది సంవత్సరాలు నూజివీడులో కష్టపడ్డారని.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని, తనకు కావాలని చెప్పడం లేదన్నారు.ఇప్పటికే టిడిపి రెండు సార్లు నూజివీడులో ఓడిపోయిందని.. ఈ సారి ఖచ్చితంగా గెలవాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

