Telangana: అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్..

Telangana: అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్..

Ram Naramaneni

|

Updated on: Feb 17, 2024 | 1:05 PM

కాగా నేడు కేసీఆర్‌ 70వ బర్త్‌ డే...రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబారన్నంటనున్నాయి..కేటీఆర్‌ గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు కలిసి 70 కేజీల కేక్‌ కట్‌ చేశారు. మరోవైపు అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  శాాసన సభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా,  10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి.. 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో తన పాత్రను పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి.. కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి.. తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్ర పోషిస్తూ..  ప్రతిపక్ష నాయకుడిగా సభను సజావుగా నడవడానికి..  తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడానికి..  వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని.. కోరుకుంటున్నా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా నేడు కేసీఆర్‌ 70వ బర్త్‌ డే…రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబారన్నంటనున్నాయి..కేటీఆర్‌ గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు కలిసి 70 కేజీల కేక్‌ కట్‌ చేశారు. అంతేకాదు.. వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కింద లక్ష రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు..అలాగే దివ్యాంగులకు వీల్‌చైర్స్‌ పంపిణీ చేశారు…కేసీఆర్ జీవిత చరిత్ర, చారిత్రక ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ 30 నిమిషాలపాటు డ్యాక్యుమెంటరీ ప్రదర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

 

 

Published on: Feb 17, 2024 12:57 PM