మా జిల్లాను మహారాష్ట్రాలో కలిపేయండి.. అసెంబ్లీ సాక్షిగా సిర్పూర్ ఎమ్మెల్యే ఆవేదన.!
దశాబ్దాలు గడిచిన మా ప్రాంతం అభివృద్దికి నోచుకోవడం లేదని.. స్వరాష్ట్రం సిద్దించిన ఇంకా తమ ప్రాంతం అభివృద్దికి అట్టడుగున ఉండిపోయిందని.. గత దశాబ్ద కాలంలో అభివృద్దికి నిధులుఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా మార్పు రాలేదని.. ఇప్పుడుకూడా నిధులు కేటాయించని పక్షంలో తమ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు.
దశాబ్దాలు గడిచిన మా ప్రాంతం అభివృద్దికి నోచుకోవడం లేదని.. స్వరాష్ట్రం సిద్దించిన ఇంకా తమ ప్రాంతం అభివృద్దికి అట్టడుగున ఉండిపోయిందని.. గత దశాబ్ద కాలంలో అభివృద్దికి నిధులుఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా మార్పు రాలేదని.. ఇప్పుడుకూడా నిధులు కేటాయించని పక్షంలో తమ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు. సాగునీటి రంగం, సివిల్ సప్లైస్ పై జరిగిన పద్దుల చర్చ సందర్భంగా మాట్లాడిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.. వెనుకబడిన తమ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నిధులు కేటాయించని పక్షంలో పక్కనే ఉన్న మహారాష్ట్రలో తమ జిల్లాను కలిపేయమని డిమాండ్ చేశారు. తమ ఆవేదనను సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం శాసనసభ కమిటీ వేయాలని, వెనకబాటుతనంపై అధ్యయన మరియు పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు.
తమ నియోజక వర్గానికి వర ప్రదాని అయిన ప్రాణహిత తుమ్మిడి హెట్టి వద్ద డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, అడ ప్రాజెక్టు కాలువల పనులను వెంటనే పూర్తిచేయాలని , పిపిరావు ప్రాజెక్టు పూడిక తీసి 11 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం కేవలం దక్షిణ తెలంగాణకు నీళ్లు తరలించి ఉత్తర తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, వాటిని సవరించాలని కోరారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు రోడ్ల నిర్మాణం కోసం రూ.12 కోట్ల నిధులు అటవీ శాఖకు చెల్లించాలని కోరారు. ఇవేమి ఇవ్వలేని పక్షంలో తెలంగాణ నుండి కొమురంభీం జిల్లాను మహారాష్ట్ర లో కలిపేయాలని.. కనీసం ఆ రాష్ట్రంలో చేరితే అయిన మా ప్రాంతం అభివృద్ది చెందుతుందేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో సిర్పూర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అదికార పార్టీ నేతలు పెదవి విరుస్తుంటే.. నియోజక వర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేయడం కొసమెరుపు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.