Telangana: ప్రగతిభవన్‌పై రాహుల్ గాంధీ సంచలన ప్రకటన
ప్రగతిభవన్‌పై రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను ప్రజా పాలన భవన్‌గా మార్చేస్తామన్నారు. ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్బార్ గేట్లు 24 గంటలు ఓపెన్‌గానే ఉంటాయన్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యల్ని సీఎం సహా మంత్రులంతా వింటారని పేర్కొన్నారు.
ప్రగతిభవన్‌పై రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను ప్రజా పాలన భవన్‌గా మార్చేస్తామన్నారు. ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్బార్ గేట్లు 24 గంటలు ఓపెన్‌గానే ఉంటాయన్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యల్ని సీఎం సహా మంత్రులంతా వింటారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల్ని 72 గంటల్లో పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ప్రజా పాలన భవన్ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఇది విద్వేషాలు రగిలించే దేశం కాదని ప్రేమను పంచే దేశమని రాహుల్ ఉద్వేగంగా ప్రసంగించారు. రాహుల్ గాంధీ రోడ్ షోకి భారీ ఎత్తున జనం వచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..