Rahul Gandhi: తెలంగాణ గడ్డపై కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. మరికాసేపట్లో రాహుల్ ప్రసంగం.. లైవ్ వీడియో

Edited By: Basha Shek

Updated on: Oct 23, 2022 | 10:05 AM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో తెలంగాణలోకి ప్రవేశించనుంది. మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో తెలంగాణలోకి ప్రవేశించనుంది. మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం కర్ణాటకలోని రాయచూర్ ఎర్మాసూర్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కృష్ణా నదిపైనున్న బ్రిడ్జి నుంచి తెలంగాణలోకి ప్రవేశించనున్నారు. తెలంగాణలో తొలిరోజు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. గుడి బెల్లూరులో పాదయాత్ర ప్రారంభించడంతోపాటు.. రాహుల్ 10గంటలకు సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించేలా రాహుల్‌ను స్వాగతించనున్నారు. ముందుగా తెలంగాణలోకి ప్రవేశించేముందు.. రాహుల్ గాంధీకి జాతీయ జెండాను అందించి కాంగ్రెస్ శ్రేణులు.. స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే.. భారీగా చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ginna: సినిమా బాగున్నా.. జనాలు రావట్లే !! మరీ దారుణంగా కలెక్షన్లు !!

Samantha Ruth Prabhu: ఆ సీన్స్ కోసం రిస్క్‌ చేసిన సమంత..

RGV: పవన్‌ కళ్యాన్‌ స్పీచ్‌ పై.. RGV సంచలన కామెంట్స్

Bheemla Nayak: పవన్ కోసం సూపర్ హిట్ ఫిల్మ్ వదులుకున్న బాలయ్య..

టోల్ గేట్ ను బలంగా ఢీ కొట్టిన కారు.. ఎగిరిపడ్డ డ్రైవర్ !!

 

Published on: Oct 23, 2022 10:00 AM