Viksit Bharat Sankalp Yatra: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేక కార్యచరణను రూపొందించి.. కేంద్ర పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు.. వారికి అందేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు దోహదపడనున్నాయి. దీనిలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో నేరుగా సంభాషించారు. అంతేకాకుండా.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను పలు రాష్ట్రాలలో ప్రారంభించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను ప్రధాన మంత్రి మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. లైవ్ లో వీక్షించండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…