PM Modi Exclusive Interview: టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా ‘మోదీతో టీవీ9 నెట్‌వర్క్‌ ఇంటర్వ్యూ’.. లైవ్ చూడండి

|

May 02, 2024 | 8:13 PM

తెలుగు రాష్ట్రాల్లో మరో పాత్‌ బ్రేకింగ్‌ ఇంటర్వ్యూ ఇది. ఇప్పటివరకు తెలుగు టీవీ తెరపై చూడని కాంబినేషన్‌ ఇది. సీనియర్‌ జర్నలిస్ట్‌, టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌, ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు. తెలుగు ప్రజల గొంతుకై... ప్రధానికి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని నుంచి కూడా ఈ ప్రశ్నకలు ఆసక్తికర సమాధానాలు వచ్చాయి.

ఇండియాలోనే బిగ్గెస్ట్‌ నెట్‌వర్క్‌… కంట్రీలోనే బిగ్గెస్ట్‌ జర్నలిస్ట్స్‌… టోటల్‌ నేషనల్‌ మీడియాలోనే బిగ్గెస్ట్‌ షో… అవును, ప్రధాని నరేంద్రమోదీతో టీవీ9 నెట్‌వర్క్‌ చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు దేశంలో ట్రెండింగ్‌ అవుతోంది. ‘మోదీతో టీవీ9 నెట్‌వర్క్‌ ఇంటర్వ్యూ’ టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారింది. 5 ఎడిటర్స్‌ రౌండ్‌ టేబుల్‌ ప్రోగ్రామ్‌‌ ఐడియాకు దేశం అంతా ఫిదా అయ్యింది. దేశవ్యాప్తంగా 7 భాషల్లో ప్రసారం అయింది మోదీ ఇంటర్వ్యూ. టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్‌… ప్రధాని మోదీ నుంచి సంచలనాత్మక సమాధానాలు రాబట్టారు. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులోకి ఎందుకు వెళ్లింది?. ఏపీలో ఎవరు గెలుస్తారని మోదీ అనుకుంటున్నారు? అంటూ ఏపీ రాజకీయాలపై ప్రశ్నించారు. దీనికి ప్రధాని కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఇక తెలంగాణ సెంట్రిక్‌గానూ ఇంటర్వ్యూ సాగింది. సీఎం రేవంత్‌ తనను పెద్దన్న అనడాన్ని మోదీ ఎలా చూస్తున్నారు?.రేవంత్ పాలనపై ప్రధాని రేటింగ్‌ ఏంటి? వంటి ప్రశ్నలకు కూడా ప్రధాని సమాధానాలు చెప్పారు.

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.