PM Modi: ప్రకృతి అందాలను తిలకించిన ప్రధాని మోదీ.. ఫోటో షూట్ వీడియో వైరల్..

ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి అందమైన సహజసిద్ద ప్రదేశాలను సందర్శించారు. వాటిని తన డిజిటల్ కెమెరాలో బంధించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలిటికల్ హీట్ నుంచి కాస్త సేదతీరేందుకు ఈ ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

PM Modi: ప్రకృతి అందాలను తిలకించిన ప్రధాని మోదీ.. ఫోటో షూట్ వీడియో వైరల్..

|

Updated on: May 24, 2024 | 6:21 PM

ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి అందమైన సహజసిద్ద ప్రదేశాలను సందర్శించారు. వాటిని తన డిజిటల్ కెమెరాలో బంధించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలిటికల్ హీట్ నుంచి కాస్త సేదతీరేందుకు ఈ ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అన్ని అందమైన ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించడం వీలు పడలేదని రాసుకొచ్చారు. అందుకే మిగిలిన అందమైన ప్రకృతి దృశ్యాలను, సహజ సౌందర్యాన్ని తన డిజిటల్ కెమెరాలో బంధించి మధుర స్మృతులుగా భద్రపరుచుకోవాలని ప్రయత్నించారు. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడం ప్రకృతి ప్రేమికులతో పాటు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాని మోదీకి ప్రకృతి అన్నా, జంతువులు అన్నా ఎంతటి ప్రేమో మరోసారి ఈ వీడియో ద్వారా రుజువు చేశారు. గతంలో కూడా కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో పర్యటించినప్పుడు అక్కడి లోయలను, వైల్డ్ అనిమల్ ఫోటోగ్రఫీలో కూడా పాల్గొన్నారు మోదీ. ఇదే విధంగా హిమాచల్ ప్రదేశ్లోని ప్రకృతి అందాలను వీక్షించారు. హిమాచల్ ప్రదేశ్ తో తనకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది, దృఢమైనది అని చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us
Latest Articles