Perni Nani: ‘వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది’.. మాజీ మంత్రి పేర్ని నాని..

|

Apr 27, 2024 | 2:54 PM

2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని కొనియాడారు.

2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెప్పిన హామీలను అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గత వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి ప్రచారానికి తెరలేపారన్నారు. 2019లో లాగానే 2024లో కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అలివిగాని హామీలను చెప్పలేనన్న సీఎం జగన్ చెప్పిన ప్రతి విషయానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు పేర్ని నాని. గతంలో నవరత్నాలు పేరుతో 9 సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎంజగన్ ఈసారి కూడా అదే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..