Pawan Kalyan: కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అంజన్నకు ప్రత్యేక పూజలు.. లైవ్ వీడియో..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళ్లిన పవన్‌కల్యాణ్ కు .. అభిమానులు పలు చోట్ల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కల్యాణ్ ముడుపులు కట్టారు.
ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరుతారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jun 29, 2024 08:57 AM
వైరల్ వీడియోలు
Latest Videos